ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి'

By

Published : May 5, 2021, 8:11 PM IST

కరోనా కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూను ప్రజలు పాటించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

corona regulation actions at prakasham district
corona regulation actions at prakasham district

ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్టు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో 3 వేల పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

ప్రతీ నియోజవకర్గంలో ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అన్నారు. వైద్యం, ఇతర సేవలు సక్రమంగా అందే విధంగా ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. పాక్షిక లాక్‌ డౌన్‌ అమలు చేయడానికి సైతం ప్రత్యేక అధికారులను నియమించినట్టు చెప్పారు. ప్రజలు కరోనా కర్ఫ్యూ ఆంక్షలు పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details