ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సనాతన వైద్యం ప్రస్తుతం చాలా అవసరం'

By

Published : Aug 5, 2021, 7:53 PM IST

ప్రకాశం జిల్లా కొత్తపేటలోని సనాతన్ జీవన్ ట్రస్ట్​ను మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. సనాతన నాడీ వైద్యం, గోశాల గురించి వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. ప్రాచీన వైద్యం ప్రస్తుత సమయంలో చాలా అవసరమని తెలిపారు.

Minister Srinivasa Venugopalakrishna
మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో సనాతన్ జీవన్ ట్రస్ట్​ను సందర్శించారు. సనాతన నాడీ వైద్యం, గోశాల గురించి వివరాలు తెలుసుకున్నారు.

సనాతన జీవన విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ప్రాచీన వైద్యం ప్రస్తుత సమయంలో అవసరమని చెప్పారు. నాడీ వ్యవస్థ ద్వారా మన శరీరంలోని సమస్యలు తెలుసుకొని వైద్యం అందించడం చాలా గొప్ప విషయమని.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాచీన జీవన వైద్య విధానానికి మంచి ఆదరణ లభిస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details