ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోవా మద్యం కంటైనర్​ను పట్టుకున్న సెబ్ అధికారులు.. ఒకరు అరెస్ట్

By

Published : Nov 11, 2021, 7:38 PM IST

గోవా నుంచి ప్రకాశం జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు చేసిన తనిఖీల్లో కంటైనర్​లో తరలిస్తున్న 6,120 మద్యం సీసాలు పట్టుబడ్డాయి.

ILLICIT LIQUOR
ILLICIT LIQUOR

ఎస్ఈబీ అధికారుల తనిఖీల్లో లక్షల రూపాయలు విలువచేసే మద్యం పట్టుబడిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో జరిగింది. మద్యం అక్రమ రవాణాపై ముందస్తు సమాచారం అందుకున్న ఎస్ఈబీ అధికారులు ఒంగోలు-వేటపాలెం బైపాస్ రహదారిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఒంగోలు నుంచి కఠారిపాలెం క్రాస్ రోడ్డులో రొయ్యలు రవాణా చేసే కంటైనర్​ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భారీగా మద్యం కేసులను గుర్తించారు.

కంటైనర్​లో పట్టుబడిన అక్రమ మద్యం వేటపాలెం మండలం పొట్టి సుబ్యయ్యపాలెంకు చెందిన ప్రళయ కావేరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. 156 బాక్సుల్లో 6,120 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సూపరింటెండెంట్​ ఆవులయ్య తెలిపారు. వీటిని గోవా(ILLICIT GOA LIQUOR CAUGHT BY SEB OFFICIALS) నుంచి అక్రమంగా తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ మద్యం విలువ రూ. 13.52 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కంటైనర్ డ్రైవర్​ను అరెస్టు చేసిన అధికారులు.. ప్రధాన నిందితుడు ప్రళయ కావేరి వెంకటేశ్వర్లును త్వరలోనే పట్టుకుంటామని ఆవులయ్య వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details