ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సంతకాలు ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి'

By

Published : Oct 20, 2020, 4:20 PM IST

మేదరమెట్ల గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘం సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్​ను కలిశారు. గ్రూప్​ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమెను కోరారు.

dwacra ladies given letter to medarametla village
ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్​కు వినతిపత్రం అందజేసిన డ్వాక్రా మహిళలు

కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన విశాల డ్వాక్రా సంఘం సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్​ ధనలక్ష్మిని కలిశారు. గ్రూప్​ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి రుణం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో పనిచేసే వీవోఏలు, వెలుగు సిబ్బంది చొరవతోనే ఈ రుణం పొందారని మహిళలు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన రుణం నగదు ఇప్పించాలని డ్వాక్రా మహిళలు కోరారు.

ABOUT THE AUTHOR

...view details