ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Navaratri: శాకాంబరీ దేవి అవతారంలో.. కన్యకాపరమేశ్వరి

By

Published : Oct 13, 2021, 11:52 AM IST

రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా.. చీరాలలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు.. శాకాంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

dasara navaratri celebrations at prakasam and west godavari
శాకాంబరీ దేవిగా కన్యకపరమేశ్వరి అమ్మవారు

ప్రకాశం జిల్లా చీరాలలో.. దేవీ శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా చీరాలలోని కన్యకపరమేశ్వరి అమ్మవారు.. శాకాంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు.. అంతరాలయం, అమ్మవారి విగ్రహాన్ని వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ముందుగా అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి సువాసినీ పూజలు చేశారు.

పశ్చిమగోదావరిలో..
పశ్చిమగోదావరి జిల్లాలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. తణుకు మండలం దువ్వ గ్రామంలోని దానేశ్వరి అమ్మవారు.. దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details