ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్, వైసీపీ పెద్దలపై బాలినేని అసంతృప్తి - రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపిన వ్యాఖ్యలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 6:45 PM IST

Updated : Dec 10, 2023, 8:18 PM IST

Balineni Srinivasa Reddy Unhappy with YSRCP Elders: బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రి పదవి కోల్పోయిన రోజు నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మనసులో దాచుకోవాల్సిన అనేక విషయాలను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడిన మాటలు, తీరు చూస్తుంటే అసలు పార్టీలో ఉంటారా?, బయటకు వెళ్లిపోతారా?, లేక ముఖ్యమంత్రి జగన్‌తో తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

balineni_srinivasa_reddy_unhappy
balineni_srinivasa_reddy_unhappy

Balineni Srinivasa Reddy Unhappy with YSRCP Elders: మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీ అధిష్ఠానం, పెద్దల పట్ల వ్యవహరిస్తున్న తీరు, వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి పదవి కోల్పోయిన నాటి నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డి సీఎం జగన్, పార్టీ పెద్దలపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనసులో దాచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వెల్లడిస్తున్నారు. దీంతో ఆయన (బాలినేని) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా?, బయటకు వెళ్లిపోతారా?, లేక ముఖ్యమంత్రి జగన్‌తో తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారా? అనే ప్రశ్నలు ఆ పార్టీ నేతల్లో చర్చకు తెరలేపాయి.

Balineni To place in First Cabinet: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాస రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీ అధిష్ఠానం నుంచి ఆయన కోరుకున్న వారికి టికెట్లు, పదవులు ఇప్పించుకునే నేతగా పేరుగాంచారు. అంతేకాదు, వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. అయితే, రెండున్నరేళ్ల క్రితం మంత్రి పదవి కోల్పోయిన బాలినేని అప్పటి నుంచి సీఎం జగన్, పార్టీ పెద్దలపై అసహనం, అసంతృప్తిని కనబరుస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

వైసీపీ వస్తుందని నా కుమారుడికి నమ్మకం ! అంతే అభిమానం జగన్​కు కూడా ఉండాలిగా: బాలినేని వివాదాస్పద వ్యాఖ్యలు

Balinese Intolerance of YCP Elders:నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యం తగ్గిపోతుందని బాలినేని బహిరంగంగానే ఎన్నోసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతోపాటు పార్టీలో తనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆయన బావ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలే ఇందుకు కారణమని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. సీఎం జగన్‌తో సుబ్బారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో, తనపై ఆయన లేనిపోని మాటలు చెప్తున్నారని బాలినేని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకసార్లు ఆయన ఆవేదనను వెళ్లగక్కారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని గతంలో బాలినేని కన్నీరు పెట్టుకున్నారు.

Balineni Guarantee on Home Rails: ఇటీవల ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామనిబాలినేని కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని బహిరంగంగా ప్రకటించారు. ఆ మేరకు యరజర్ల వద్ద దాదాపు 21 వేల మందికి పట్టాలిచ్చేందుకు ప్రభుత్వ భూమిని సేకరించారు. అది కోర్టు వివాదంతో ఆగిపోవడంతో కొప్పోలులో ప్రైవేటు భూములు సేకరించి, పట్టాలు ఇవ్వాలన్న ఆలోచనను సీఎం జగన్‌కు వెల్లడించారు. దాంతో ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతోపాటు స్థల సేకరణకు 30 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. 200 కోట్ల వరకు ప్రభుత్వం నిధులు విడుదల కావాలి. కానీ, జగన్‌ను రెండుమూడు సార్లు కలిసినా నిధులు మంజూరు కాలేదు. దీంతో బాలినేనిలో అసహనం పెరిగిపోయింది. 'జగన్ అంటే నాకు ఎనలేని అభిమానం. కానీ, ఆయనకు మా మీద ఉండొద్దా' అని బాలినేని నర్మగర్భంగా అసంతృప్తి వ్యక్తపరిచారు.

Balineni : ఆరోపణలు నిరూపిస్తే.. ఆస్తులు రాసిస్తా : మాజీ మంత్రి బాలినేని

Debate on Balineni Party Switching:మరోవైపు నియోజకవర్గంలో లుకలుకలతో ఒంగోలు వదిలి బాలినేని గిద్దలూరుకు వెళ్తారనే ప్రచారం కూడా అక్కడక్కడా జరుగుతోంది. పార్టీ మారతారనే విషయంపైనా చర్చ నడుస్తోంది. ఒంగోలులో ఇటీవల భూ కబ్జాలు, నకిలీ స్టాంపు కుంభకోణాలు వ్యవహారంపై బాలినేని మీద మచ్చపడడం, ఈ అంశంలో ఆయనకు అత్యంత సన్నిహితులు, బంధువులపై ఆరోపణలు రావడంతో ఇరుకున పడ్డారు. ఈ సంఘటనల తర్వాత మరోసారి అధిష్టానం తీరును ప్రశ్నిస్తున్నట్లుగా ఆయన వ్యాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం వైఖరితో బాలినేని తరచూ అసహనం, అసంతృప్తి ప్రదర్శిస్తున్నారు. రాజకీయ భవిష్యత్తుపైనా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారాయి.

అలా మాట్లాడితే.. ఎవరైనా చర్యలు తప్పవు: బాలినేని

సీఎం జగన్, వైసీపీ పెద్దలపై బాలినేని అసంతృప్తి - రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపిన వ్యాఖ్యలు
Last Updated :Dec 10, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details