ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంజనాద్రిపై తితిదే ప్రకటనతో నా కల నేరవేరింది: అన్నవరం చిదంబర శాస్త్రి

By

Published : Apr 22, 2021, 3:58 PM IST

తిరుమల గిరిల్లో హనుమంతుడు జన్మించాడంటూ గత ఐదు దశాబ్దాలుగా తన వాదన వినిపిస్తున్న ప్రకాశం జిల్లా చీరాల వాసి, హనుమాన్‌ ఉపవాసకులు, పరిశోధకులు డా. అన్నవరం చిదంబర శాస్త్రి.. తాజాగా తితిదే ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. తాను అనేక భౌగోళిక, చారిత్రిక, పౌరాణిక పరిశోధనలతో హనుమంతుడు ఇక్కడ జన్మించినట్లు ఆధారాలు చూపానని, తన ఆధారాలతో తితిదే కమిటీ పవిత్ర శ్రీరామనవమి రోజున ప్రకటన చేయడం ఆనందదాయకమని, దీంతో తన కల నెరవేరిందని ఆయన తన స్పందనలో తెలిపారు. అంజనాద్రిలో ఆంజనేయుడు పుట్టిన ప్రాంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చేయాలని, వసతి, రవాణా మార్గాలు పెంచాలని ఆయన కోరారు. మా 'ఈటీవీ భారత్' ప్రతినిధి రవికృష్ణతో మరిన్ని వివరాలు అందించారు.

Annavaram Chidambara Sastry respond on ttd announce of birth place of hanuman
అన్నవరం చిదంబర శాస్త్రి

ABOUT THE AUTHOR

...view details