ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయ్ సాయిరెడ్డిపై సోమువీర్రాజు ఫైర్..! దమ్ము, ధైర్యం ఉంటే చర్చకి రావాలని సవాల్..!

By

Published : Feb 19, 2023, 1:21 PM IST

BJP president Somu Veerraju fire on Ycp govt: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ సాయి రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఒకే వేదికపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలను కేటాయిస్తుంటే.. వాటిని రాష్ట్ర అభివృద్దికి వినియోగించకుండా ఇసుక, మద్యం మాఫియాలకు ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు.

Somu Veerraju
Somu Veerraju

BJP president Somu Veerraju fire on Ycp govt: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోము వీర్రాజు ఈరోజు విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోజురోజుకి ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గ్యాంగ్ మాఫియాల ఆగడాలు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్య్రమాలన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణం కూడ కేంద్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులేనని సోము వీర్రాజు పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నిధుల విడుదల, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, అప్రోచ్ రోడ్డు నిర్మాణాలు అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలేనని తెలియచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని, ఈ విషయం గురించి తాను ఎక్కడికొచ్చైనా మాట్లాడుతానని, బహిరంగ చర్చకు కూడా తాను సిద్దమని సోము వీర్రాజు వెల్లడించారు.

ఒకవైపు రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంటే.. విజయ్ సాయి రెడ్డి వంటి వాళ్లు బీజేపీకి శాపనార్థాలు పెడుతున్నారు. పార్లమెంట్‌లో మా ఓట్ల గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. 8 లక్షల 65వేల కోట్లు రూపాయలను ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము. బిల్లులో ఉన్న అంశాలు ఏమిటీ, బిల్లులో లేని అంశాలను ఏ విధంగా రాష్ట్రంలో అమలు జరుపుతున్నాము మా దగ్గర అన్ని క్లియర్‌గా వివరాలు ఉన్నాయి. ఈ వివరాల ప్రకారం ఎవరికైనా సమాధానాలను చెప్పడానికి మేమంతా సిద్దంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్‌లో 60 రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము. అతి త్వరలోనే ప్రజా పోరు-2 అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తాము- సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు

అనంతరం వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాయి రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఒకే వేదికపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంటే.. మరోవైపు విజయ్ సాయి రెడ్డి వంటి వాళ్లు బీజేపీకి శాపనార్థాలు పెడుతూ, పార్లమెంట్‌లో తమ ఓట్ల గురించి ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. 8 లక్షల 65వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలో ఏ విధంగా ఖర్చు పెడుతున్నామో.. తమ వద్ద పూర్తి వివరాలున్నాయన్నారు. బిల్లులో ఉన్న అంశాలు ఏమిటీ?, బిల్లులో లేని అంశాలను ఏ విధంగా రాష్ట్రంలో అమలు జరుపుతున్నామో? వివరించడానికి తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 60 రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అతి త్వరలోనే 'ప్రజా పోరు-2' అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివరాలను వెల్లడించారు.

విజయ్ సాయిరెడ్డికి దమ్ముంటే బహిరంగ చర్చకి రావాలి..

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details