ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యువకుడి కడుపులోకి దిగిన బోరింగ్ హ్యాండిల్.. పరిస్థితి విషమం

By

Published : Jan 19, 2023, 3:32 PM IST

Updated : Jan 19, 2023, 4:50 PM IST

Boing

Bike Accident: అతివేగం ప్రమాదకరం అని చెబితే ఆ మాటను పట్టించుకోని వారి వరుసలో యువత ముందుంటుంది. ప్రాణం తీసే వేగంతో వాహనాలు నడిపి కొన్నిసార్లు అవయవాలు కోల్పోతున్నారు. మరికొన్నిసార్లైతే మితిమీరిన వేగంతో వారు చేరుకోవాల్సిన గమ్యాన్ని విడిచి.. మరణానికి చేరుకుంటున్నారు. ఇలా జరుగుతున్న సంఘటనలకు మరో ఉదాహరణగా ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అతి వేగంతో వచ్చిన యువకుడు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బోరింగ్ (చేతి పంపు)ను ఢీకొనడంతో.. చేతిపంపునకు ఉండే హ్యాండిల్ అతని పొట్టలోకి దూసుకువెళ్లింది. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Bike Accident: ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఓ యువకుడు అతివేగంతో ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. అతివేగంగా వాహనం నడిపిన యువకుడి పొట్టలోకి చేతి పంపునకు ఉండే హ్యాండిల్ దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన ఈర్ల నాగరాజు అనే యువకుడు బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మితిమీరిన వేగంతో ఇంటికి వెళుతుండగా రాజీవ్ కాలనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బోరింగ్ (చేతి పంపు) ను ఢీకొంది. దీంతో ఫలితంగా చేతిపంపునకు ఉండే హ్యాండిల్ హనదారుని పొట్టలోకి దూసుకువెళ్లి అవతల వైపునకు వచ్చింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి, యువకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న 108 వాహన సిబ్బంది హుటాహుటిన వెల్డింగ్ కట్టర్​తో బోరింగ్ హ్యాండిల్​ని రెండు వైపులా కత్తిరించి వెంటనే ఒంగోలు కిమ్స్ వైద్యశాలకు తరలించారు. కిమ్స్ వైద్యులు, శస్త్ర చికిత్స చేసి పొట్టలో ఉన్న బోరింగ్ హ్యాండిల్ ముక్కను బయటకు తీశారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

యువకుడి పొట్టలోకి దూసుకెళ్లిన బోరింగ్ హ్యాండిల్

ఇవీ చదవండి:

Last Updated :Jan 19, 2023, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details