ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Social Welfare Hostels Probelms: "జగన్​ మామయ్య.. మా హాస్టల్స్​ ఎప్పుడు బాగుపడతాయి".. నెల్లూరులో శిథిలావస్థకు హాస్టల్స్​

By

Published : Jul 29, 2023, 7:16 AM IST

YSRCP Negligence on Social Welfare Hostels: ఆంధ్రప్రదేశ్​ విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా చేస్తానని ముఖ్యమంత్రి జగన్​ గొప్పలు చెబుతుంటారు. కానీ వారు ఉండే సోషల్​ వెల్ఫేర్​ హాస్టల్స్​ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పెచ్చులూడిన భవనాల్లో ఉండలేక.. సరైన వసతులు కల్పించక నానా అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.

YSRCP Negligence on Social Welfare Hostels
YSRCP Negligence on Social Welfare Hostels

YSRCP Negligence on Social Welfare Hostels: విద్యార్థుల మేనమామనంటూ చెప్పుకునే సీఎం జగన్‌.. వారి కోసం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను.. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేస్తానని గొప్పలు చెబుతుంటారు.. కానీ వారు ఉండటానికి సరైన వసతులు మాత్రం కల్పించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెచ్చులూడిన భవనాల్లోనే విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. ఈ నాలుగేళ్లలో.. ఒక్కసారి కూడా మరమ్మతుల చేపట్టకపోవడంతో...నెల్లూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ప్రమాదకరంగా మారాయి.

మన రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థుల వసతి గృహాలు పెచ్చులూడి.. శిథిలావస్థుకు చేరుకున్నాయి. పిల్లల్ని చదివించాలనే ఆశ ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల వెనుకంజ వేసే తల్లిదండ్రులకు భారం తగ్గించేందుకు ఈ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు నెలకొల్పారు. పేదల పక్షపాతిని అని చెప్పుకునే జగన్ మాత్రం ఈ హాస్టల్స్‌ని గాలికొదిలేశారు. ఫలితంగా ఎటు చూసినా.. పెచ్చులూడిన పైకప్పు, పగుళ్లు వచ్చిన గోడలు, విరిగి పోయిన తలుపులు దర్శనిమిస్తున్నాయి.

"వర్షాలు కురిసినప్పుడు నీరు అంతా లోపలికి వస్తుంది. అప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతోంది. ఒక్కోసారి పెచ్చులూడి మీద పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. లగేజ్​ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. నిద్ర పోవడానికి కూడా అవస్థలు పడాల్సి వస్తోంది." -విద్యార్థులు

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న వసతి గృహాల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఈ భవనాల్లో ఉంటే ఎప్పుడూ పెచ్చులూడి పడతాయోనని విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉంటున్నారు. వర్షాలు వచ్చినప్పుడు తమ బట్టలు, పుస్తకాలు తడిచిపోతున్నాయని.. ఒక్కోసారి పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాత బిల్డింగ్​ కాబట్టి వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుంది. వానలు వస్తే ఏ పిల్లలను కూడా ఇక్కడ ఉంచం. కొత్త బిల్డింగ్​కే మారుస్తాం. అయితే కొత్త బిల్డింగ్​లో సరిపడ గదులు లేక చాలా మంది విద్యార్థులు క్లాస్​రూంలోనే పడుకుంటారు.-ఉపాధ్యాయులు, కావలి

నెల్లూరు జిల్లాలో ఉన్న BC, SC, ST హాస్టల్స్‌లో ఒక్కొ దాంట్లో వంద మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. గదికి ఐదుగురు మాత్రమే ఉండాల్సిన చోట పది మందికి పైగా ఉంటున్నారు. కొన్ని వసతి గృహాల్లో సరైన నీటి సౌకర్యం కూడా లేదు. కావలిలో నూతన హాస్టల్‌ నిర్మించారు. అయితే అది విద్యార్థులకు చాలకపోవడంతో కొంతమంది.. శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే ఉంటున్నారు. పెచ్చులూడి పడితే ప్రమాదమని భావించి.. రాత్రి పడుకునేటప్పుడు కొత్త భవనానికి విద్యార్థులను తీసుకెళ్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తమ అవస్థలను అర్థం చేసుకుని హాస్టల్స్‌కి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

"జగన్​ మామయ్య.. మా హాస్టల్స్​ ఎప్పుడు బాగుపడతాయి"

ABOUT THE AUTHOR

...view details