ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Water flow: మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న గంగమ్మ

By

Published : Nov 30, 2021, 12:10 PM IST

Nellore News: నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల భూగర్భ జలాలు ఉబికివస్తున్నాయి. చేతిపంపులు కొట్టకుండానే నీరు వస్తోంది. కొందరి పొలాల్లో మోటర్ సాయం లేకుండానే బోరుబావి నుంచి నీరు వస్తోంది.

water-coming-from-bores-with-out-using-motors-in-nellore
మోటార్ సాయం లేకుండానే పొలాల వద్ద పొంగుతున్న గంగమ్మ

మోటార్ సాయం లేకుండానే పొలాల వద్ద పొంగుతున్న గంగమ్మ

water flow from bores without motor: నెల్లూరు జిల్లా ఆత్మకూరు, మర్రిపాడు మండలాల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల (nellore rains)తో కొన్నిచోట్ల భూగర్భ జలాలు ఉబికివస్తున్నాయి. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద చేతి పంపు నుంచి నీరు పైకి వస్తోంది. చేతితో కొట్టకుండానే.. స్థానికులు నీళ్లు పట్టుకెళ్తున్నారు.

మర్రిపాడు మండలం.. పల్లవోలో గ్రామానికి చెందిన జయవర్ధన్ అనే రైతుకు చెందిన పొలంలో మోటార్ సహాయం లేకుండానే బోరుబావి నుండి నీరు వస్తోంది. 175 అడుగుల లోతు బోరు బావి నుంచి మోటార్ లేకుండానే నీరు పైకి వస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బోరు కింద మిర్చి సాగు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details