ఆంధ్రప్రదేశ్

andhra pradesh

VENKAIAH NAIDU NELLORE TOUR: నెల్లూరులో ఉపరాష్ట్రపతి రెండోరోజు పర్యటన

By

Published : Nov 13, 2021, 9:53 AM IST

Updated : Nov 13, 2021, 2:23 PM IST

నెల్లూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండోరోజు పర్యటనలో భాగంగా.. దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. దివ్యాంగులతో కలిసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

vice-president-venkaiah-naidus-second-day-visit-to-nellore-district
నెల్లూరులో ఉపరాష్ట్రపతి రెండోరోజు పర్యటన

దివ్యాంగుల పట్ల దయ, సానుభూతిని చూపించడంతో పాటు వారిని ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా... వెంకటాచలంలోని దివ్యాంగుల ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు.

నెల్లూరులో ఉపరాష్ట్రపతి రెండోరోజు పర్యటన

దివ్యాంగుల్లో ఉన్న ప్రతిభను గుర్తించాలని, నైపుణ్యతను పెంచితే సాధికారిత సాధ్యం అవుతుందని అన్నారు. సామాజిక బాధ్యతగా బ్యాంకులు, దాతలు, ఆర్థిక సంస్థలు సహకరించాలని కోరారు. ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని అధిగమించవచ్చని చెప్పారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు.

ఇదీ చూడండి:PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం.. కారణమేంటంటే..?

Last Updated :Nov 13, 2021, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details