ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vice president: అదే అసలైన మతం : వెంకయ్యనాయుడు

By

Published : Nov 14, 2021, 1:42 PM IST

Updated : Nov 14, 2021, 2:13 PM IST

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు(Swarnabharat Trust) 20వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu) పాల్గొన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు ఇంతింతై... వటుడింతై.. అన్నట్లుగా ఎదిగిందన్నారు. ఏ పదవిలో ఉన్నా స్వర్ణభారత్‌ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఉపరాష్ట్రపతి చెప్పారు.

venkaiah naidu
venkaiah naidu

నెల్లూరు జిల్లా (nellore district) వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవం(20th anniversary of Swarnabharat Trust )లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu) పాల్గొన్నారు. తెలుగు భాష రక్షణ కోసం స్వర్ణభారత్ ట్రస్టు ప్రయత్నిస్తోందన్నారు. మాతృభాష, మాతృభూమిని ఎప్పటికీ మరచిపోవద్దని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన వెంకయ్య.. సేవే అసలైన మతమని తాను ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు.

'ఏ పదవిలో ఉన్నా స్వర్ణభారత్‌ కార్యక్రమాల్లో పాల్గొంటాను

సేవా సంస్థలను ప్రోత్సహిస్తారనే అనేక మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాను. సొంత ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతాను. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో... సేవాలయానికి వెళ్తే అంతే పుణ్యం వస్తుంది. ఏ పదవిలో ఉన్నా స్వర్ణభారత్‌ కార్యక్రమాల్లో పాల్గొంటాను. వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

యువతకు ప్రోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారు..

అన్నదాతలపై ఎక్కువగా దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu) సూచించారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలన్నారు. యువతకు తగినంత పోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మహిళలు ఇంకా చాలా అంశాల్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. గ్రామీణ మహిళలకు ఒకేషనల్‌ కోర్సుల కోసం కొత్త భవనం అందుబాటులోకి తెచ్చామని, దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నామని ఉపరాష్ట్రపతి తెలిపారు.

ఇదీ చదవండి

మా పాలనలో.. వారంతా రాష్ట్రపతి భవన్ లో అడుగుపెడుతున్నారు : అమిత్ షా

Last Updated : Nov 14, 2021, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details