ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయి..

By

Published : Dec 3, 2022, 8:08 PM IST

UTF LEADERS PRESS MEET: ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ఓటర్ల నమోదులో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని పీడీఎఫ్​ ఫ్లోర్​ లీడర్​, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు.

utf leaders press meet
పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్

UTF LEADERS PRESS MEET: ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ఓటర్ల నమోదులో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయని పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం నెల్లూరులో మండిపడ్డారు. అనర్హులైన వారి పేర్లను ఇష్ట రాజ్యంగా నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ సంస్థలో పనిచేయని వారి ఓటర్ల పేర్లు కూడా నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా దృష్టికి వచ్చిన ఓటర్ల జాబితాలో వందలాది మంది అనర్హుల వివరాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అనర్హులైన ఓటర్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండో విడతలో కూడా ఇలాంటి చర్యలు పునరావృతం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details