ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP news: తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి

By

Published : Jan 27, 2022, 10:22 AM IST

Updated : Jan 27, 2022, 11:35 AM IST

AP news: నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి చెందారు. పుదూరు గ్రామానికి చెందిన కొండారి చైతన్య (25), జగన్‌ (25) స్నానం చేసేందుకు తెలుగు గంగ కాల్వలో దిగారు.

తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి
తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి

AP news:నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి చెందారు. పుదూరు గ్రామానికి చెందిన కొండారి చైతన్య (25), జగన్‌ (25) స్నానం చేసేందుకు తెలుగు గంగ కాల్వలో దిగారు. ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లిపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయారు. మల్లు విష్ణు అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుల్లో చైతన్య చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుండగా.. జగన్‌ డిప్లమా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.

Last Updated :Jan 27, 2022, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details