ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిట్టుబాటు ధర కల్పించాలిని పొగాకు రైతుల నిరసన

By

Published : Apr 20, 2021, 5:38 PM IST

గిట్టు బాటు ధర కల్పించాలంటూ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతులు నిరసన చేపట్టారు. జాతీయ రహదారి పై బైఠాయించి ఆందోళన చేశారు.

Tobacco farmers protest for minimum support price at Nellore district
గిట్టుబాటు ధర కల్పించాలిని పొగాకు రైతుల నిరసన

గిట్టుబాటు ధర కల్పించాలిని పొగాకు రైతుల నిరసన

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతులు ఆందోళన చేశారు. పంటకు గిట్టు బాటు ధర కల్పించాలంటూ.. పొగాకు వేలాన్ని బహిష్కరించి జాతీయ రహదారిపై బైఠాయించారు. జాతీయ రహదారి పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పండించిన పంటకు కనీస గిట్టు బాటు ధర‌ కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు.

కొనుగోలుదారులు, బోర్డు అధికారులు కుమ్మక్కయ్యి.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై వేలం నిర్వహణ అధికారిని ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. రైతులతో మాట్లాడి నిరసన విరమింపజేశారు. రైతులు ఆందోళన విరమించి అదికారులతో చర్చలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details