ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం:సెబ్ జేడీ

By

Published : Nov 1, 2021, 5:27 PM IST

నెల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం రోజుల్లో 166 కిలోల గంజాయి పట్టుబడగా.. 15 మందిని అరెస్టు చేశారు.

సెబ్ జేడీ
సెబ్ జేడీ


గంజాయి అక్రమ రవాణాపై నెల్లూరు సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న అధికారులు అంతరాష్ట్ర గంజాయి రవాణా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గత రెండు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో దాదాపు 100 కిలోల గంజాయిని పట్టుకొగా, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు నెల్లూరు సెబ్ జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. అక్రమార్కులు గంజాయి రవాణాకు ప్రధానంగా ఆర్టీసీ బస్సులనే ఎంచుకుంటున్నారని చెప్పారు.

గత వారం రోజుల్లో జిల్లాలో 166 కిలోల గంజాయి పట్టుబడగా, 15 మందిని అరెస్ట్ చేశామని ఆమె వెల్లడించారు. పట్టుబడ్డ గంజాయి విలువ 20 లక్షల పైనే ఉంటుందని తెలిపారు. ఎవరైనా మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:
'ఆస్తి ఇవ్వలేదని తండ్రిని బంగాల్​లో వదిలేసి వచ్చిన హైదరాబాదీ!'

ABOUT THE AUTHOR

...view details