ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వర్ణ భారత్ ట్రస్ట్​లో సంక్రాంతి సంబరాలు... హాజరైన వెంకయ్యనాయుడు

By

Published : Jan 13, 2023, 7:37 PM IST

Sankranti celebrations: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణ భారత్ ట్రస్ట్​లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ లావు నాగేశ్వరరావు, త్రిభాషా సహస్ర అవధాని వద్దిపర్తి పద్మాకర్, మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి హాజరయ్యారు. పలువురు విద్యార్ధులకు బహుమతులు అందజేశారు.

Sankranti celebrations
స్వర్ణ భారత్ ట్రస్ట్​లో సంక్రాంతి సంబరాలు... హాజరైన వెంకయ్యనాయుడు

Sankranti celebrations: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 2023 సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితం కుటుంబ జీవితంలో ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ అవసరం అన్నారు. మన పూర్వీకులు చూపించిన మార్గంలో నడవండి. ఉత్సహంగా ఉల్లాసంగా ఉండండి. సంస్కృతి సంప్రదాయాలను పాటించండి అని కోరారు. ఆటలు, పాటలు, గాలి పటాలు , రైతుల పండుగ, పశువులు, పెద్దలను పూజించే పండుగ సంతోషాలతో ఉండటమే సంక్రాంతి అని అన్నారు.

స్వర్ణ భారత్ ట్రస్ట్​లో సంక్రాంతి సంబరాలు... హాజరైన వెంకయ్యనాయుడు

భాష ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను గురించి వెంకయ్యనాయుడు ఎప్పుడూ గుర్తు చేస్తుంటారని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. స్వర్ణ భారత్​కు వచ్చిన స్కూల్ విద్యార్ధులు చక్కటి తెలుగులో మాట్లాడుతున్నారని అభినందించారు. స్వర్ణ భారత్ ట్రస్టు ఆదర్శాలకు, సాంప్రదాయాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు.

మానవ సంబంధాలు. సమాజ సేవ వేదికగా స్వర్ణ భారత్ ట్రస్ట్ కొనసాగుతుందని, రాజకీయాలు ఇక్కడ మాట్లాడారని రాష్ట్ర మంత్రి కాకాణి అన్నారు. అనేక చోట్ల చూస్తే సంస్కృతి సంప్రదాయ ఉత్సవాలు ఉండటం లేదని అన్నారు. మానవ సంబంధాలు తగ్గాయని, ఇళ్లల్లో అందరూ టీవీల ముందు, సెల్ ఫొన్​ల ముందు కూర్చుంటున్నారని తెలిపారు. వెంకయ్యనాయుడు మాత్రం ట్రస్ట్ ద్వారా సేవ చెస్తున్నారని అభినందించారు.

జీవితంలో ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ అవసరం.. మన పూర్వీకులు చూపించిన మార్గంలో నడవండి. ఉత్సహంగా ఉల్లాసంగా ఉండండి. సంస్కృతి సంప్రదాయాలను పాటించండి... ఆటలు, పాటలు, గాలి పటాలు , రైతుల పండుగ, పశువులు, పెద్దలను పూజించే పండుగ సంతోషాలతో ఉండటమే సంక్రాంతి.- వెంకయ్యనాయుడు,మాజీ ఉపరాష్ట్రపతి

ఆయన రచనలు చూశాను, వ్యాసాలను చూశాను ఆయన ఎప్పుడూ భాష ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాల గురించి గుర్తు చేస్తుంటారు.- జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details