ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేబాల వద్ద బస్సు-ఆటో ఢీ.. ఒకరు మృతి

By

Published : Feb 26, 2021, 10:28 PM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

road-accident-on-national-highway-at-rebala-buchireddypalem-zone-nellore-district
బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీ... ఒకరు మృతి...

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న బస్సు, ఆటో ఢీకొన్నాయి. నెల్లూరు నుంచి ఉదయగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బుచ్చి నుంచి రేబాల వైపు వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు కింద ఆటో ఇరుక్కొపోవడంతో.. ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు కింద ఇరుక్కున్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు రెబాల గ్రామానికి చెందిన ఆత్తిపాటి సురేష్​గా గుర్తించారు. దీంతో కొద్దిసేపు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:

పెన్నాడెల్టా ఆయకట్టులో పేరుకుపోయిన గుర్రపు డెక్క

ABOUT THE AUTHOR

...view details