ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పత్రాలు లేకుండా నగదు తరలింపు.. సీజ్​ చేసిన రైల్వే పోలీసులు

By

Published : Dec 28, 2022, 12:56 PM IST

Railway Police Seized Money : ఎలాంటి బిల్లులు లేకుండా కావలి నుంచి నెల్లూరుకు తీసుకువచ్చిన 43 లక్షల రూపాయల నగదును రైల్వే పోలీసులు పట్టుకున్నారు. నగదును సీజ్ చేసి, ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు రైల్వే డీఎస్పీ మల్లికార్జునరావు చెప్పారు.

MONEY SEIZED
MONEY SEIZED

MONEY SEIZED : నెల్లూరు రైల్వే స్టేషన్​లో ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకువచ్చిన 43 లక్షలు రూపాయల నగదును రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్​లో అనుమానాస్పదంగా బ్యాగు పట్టుకుని ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. బ్యాగ్ పరిశీలించగా అందులో 43 లక్షల రూపాయల నగదు బయటపడింది. కావలిలో మహాలక్ష్మి పాన్ బోకర్స్ దుకాణం నిర్వహిస్తున్న వెంకట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు నగదు తీసుకువచ్చినట్లు రైల్వే డీఎస్పీ మల్లికార్జున రావు తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసి, ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details