ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ఒకరు మృతి, నలుగురికి గాయాలు

By

Published : Mar 24, 2021, 10:58 PM IST

ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మొత్తలు వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

one person died in auto, bus accident at mothalu
మొత్తలు వద్ద ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మొత్తలు దగ్గర ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మైపాడు నుంచి ఇందుకూరుపేట వైపు వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది.

ప్రమాద సమయంలో ఆటోలో ఐదుగురు ప్రయాణికులుండగా.. నరసాపురానికి చెందిన ఓ యువకుడు మరణించారు. మిగిలిన నలుగురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details