ఆంధ్రప్రదేశ్

andhra pradesh

9న సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ II పనులకు సీఎం శంకుస్థాపన

By

Published : Nov 6, 2020, 2:38 PM IST

ఈ నెల 9న సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ II నిర్మాణ పనులను సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.

Somashila High Level Canal Phase II  works
స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు



సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ II నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి... ఈ నెల 9న ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. రెవెన్యూ, ఇంజనీరింగ్, పోలీస్ అధికారులతో కలిసి మంత్రి ఓఎస్​డీ చెన్నయ్య... స్థల పరిశీలన చేశారు.

9న సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ II నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన
648 కోట్ల రూపాయలతో చేపడుతున్న హైలెవల్ కెనాల్ ఫేజ్ II నిర్మాణం వల్ల ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, తాగు నీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, వలసలు నివారించ వచ్చని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details