ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో అధికార పార్టీ అక్రమాలు"

By

Published : Nov 8, 2022, 1:39 PM IST

Registration Of MLC voter : శాసనమండలి ఎన్నికల ఓటర్ల నమోదులో అధికార పార్టీ అక్రమాలు కొనసాగుతున్నాయని నెల్లూరు ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. గడువుకు సమయం ముగిసిన తర్వాత కూడా వందల సంఖ్యలో అప్లికేషన్​లు తీసుకొచ్చారుని ఆక్షేపించారు.

Registration Of MLC voter
Registration Of MLC voter

"ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో అధికార పార్టీ అక్రమాలు"

Registration Of MLC voter : శాసనమండలి ఎన్నికల ఓటర్ల నమోదులో అధికార పార్టీ అక్రమాలు కొనసాగుతున్నాయని నెల్లూరు ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ఏడో తేదీ నమోదు సమయం ముగిసిన తరువాత నెల్లూరు అర్బన్ ఎమ్మార్వో కార్యాలయానికి వందల సంఖ్యలో అప్లికేషన్లు తీసుకువచ్చారని శాసనమండలి ఉపాధ్యాయ అభ్యర్థి పి.బాబు రెడ్డి, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ యం. మోహన్‌రావు తదితర నాయకులు ఆరోపించారు. ఓటర్ల నమోదులో అక్రమాలను అరికట్టాలని, ప్రతి అప్లికేషన్‌ను క్షుణంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి వైఖరి, ఓట్ల నమోదు అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల అధికారికి, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details