ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిన్నారి గొంతులో కుంకుమ కేసు : డబ్బు కష్టాలు తీరాలని అలా చేశారట..!

By

Published : Jun 20, 2022, 3:48 PM IST

Updated : Jun 20, 2022, 5:34 PM IST

nellore crime news
nellore crime news

15:45 June 20

ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని చిన్నారిని బలిగొన్న తండ్రి, నానమ్మ

నెల్లూరు జిల్లాలో మూఢ నమ్మకాలకు చిన్నారి బలైన కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలకు సంబంధించి.. మృతిచెందిన చిన్నారి తండ్రి వేణుగోపాల్‌, నానమ్మ దొరసానమ్మను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని విచారించారు. తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలనే శాంతి పూజలు చేసి, చిన్నారి నోట్లో కుంకుమ పోసినట్టు చెప్పినట్టు సమాచారం. కుంకమ నోట్లోపోసి గొంతు నొక్కడంతో చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే.

ఇదీ జరిగింది :ఆత్మకూరు మండలం పేరారెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తి.. తన ఇద్దరు కూతుళ్లను దేవుడి ఫొటోల దగ్గర కూర్చోపెట్టి పూజలు జరిపించాడు. ఆ తర్వాత వేణుగోపాల్ తన తల్లిని పిలిచి.. ఒక పాపను ఆమె చేతికి ఇచ్చి బయటకు వెళ్లి కూర్చోమన్నాడు. అనంతరం మరో పాప పునర్విక నోట్లో కుంకుమ పోసి గొంతు నులిమాడు. పాప కేకలతో కుటుంబ సభ్యులు, స్థానికులు పరిగెత్తుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో.. అక్కడి నుంచి చైన్నై ఆసుపత్రికి తరలించారు.

అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ చిన్నారి పునర్విక.. చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడు వేణుగోపాల్​ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తండ్రి వేణుగోపాల్​కు మతి స్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. విచారణ అనంతరం ఇవాళ తండ్రి వేణుగోపాల్​, నానమ్మ దొరసానమ్మను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 20, 2022, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details