ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విద్యుత్​ ఛార్జీలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి'

By

Published : Feb 17, 2020, 3:51 AM IST

500 యూనిట్లు పైన కరెంట్​ వాడిన వారికే 90 పైసలు విద్యుత్​ ఛార్జీలు పెంచినట్లు జల వనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలో సబ్​ స్టేషన్​ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన.. కరెంటు బిల్లుల విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

'విద్యుత్​ ఛార్జీలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి'
'విద్యుత్​ ఛార్జీలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి'

విద్యుత్​ సబ్​స్టేషన్​ ప్రారంభించిన మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​

కరెంటు బిల్లుల విషయంలో ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నెల్లూరులోని యనమలవారిదిన్నె వద్ద సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కరెంటు బిల్లులు 500 యూనిట్లు పైన వాడే వారికే 90 పైసలు పెంచారని చెప్పారు. నెల్లూరు నగరంలో 7.50 లక్షల కుటుంబాలు ఉండగా.. కేవలం మూడు వేల కుటుంబాలే 500 యూనిట్ల పైన కరెంట్ వాడుతున్నారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా కరెంట్ బిల్లు అందరికీ పెంచారని అనడం సరి కాదని మంత్రి అన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీతో కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో రాష్ట్రంలోనే నెల్లూరు నగరం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. విద్యుత్ అంతరాయాలను నివారించేందుకు నగరంలో మరో రెండు సబ్ స్టేషన్​లను నిర్మిస్తామని మంత్రి అనిల్​ ప్రకటించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details