ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మహిమలూరు గ్రామ వాలంటీర్​పై చర్యలు తీసుకోవాలి'

By

Published : Jun 25, 2020, 7:48 PM IST

Updated : Jun 25, 2020, 8:15 PM IST

నెల్లూరు జిల్లా మహిమలూరు వాలంటీర్​పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు స్థానిక ఆర్డీఓ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం పథకాలను లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు.

mahimaluru-village-people-action-to-be-taken-on-mahilalur-village-volunteer-in-nellore-district
ఆత్మకూరులో ఆందోళన

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో వైకాపా నేతల అండతో స్థానిక వాలంటీర్.. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందనివ్వడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. మీకు దిక్కున్న చోట చెప్పుకొండని దుర్భాషలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటువంటి వారిపై తగిన చర్యలు తీసుకొని.. అతని స్థానంలో వేరొకరిని నియమించాలని ఆత్మకూరు ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాలంటీర్​పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీచదవండి.

జూలై 1న నూతన 104, 108 వాహన సేవలు ప్రారంభం

Last Updated :Jun 25, 2020, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details