ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lovers suicide: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్య

By

Published : Jun 18, 2021, 10:26 AM IST

Updated : Jun 18, 2021, 11:59 AM IST

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు గిరిజన కాలనీలో ఈ ఘటన జరిగింది.

ప్రేమ జంట ఆత్మహత్య
ప్రేమ జంట ఆత్మహత్య

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గిరిజన కాలనీలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే నవీన్ (21), ఆయేషా(18) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావటంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఈరోజు తెల్లవారుజామున ప్రేమికులిద్దరూ విషగుళికలు తిన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.

ఆత్మకూరు సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డిలు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండీ..Anandayya Medicine: 'దైవకృపతోనే మందు తయారీ సాధ్యమైంది'

Last Updated :Jun 18, 2021, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details