ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐటీ మంత్రి మెచ్చిన అభిమాని ''తేనీరు''

By

Published : Oct 24, 2019, 10:23 AM IST

ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తన అభిమానిని ఆశ్చర్యానికి గురిచేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించిన ఆయన... తన అభిమాని టీ కొట్టుకు వెళ్లి తేనీరు సేవించారు. ఆత్మకూరు వచ్చినప్పుడల్లా కార్యకర్తలతో కలిసి సరదాగా టీ తాగుతారని స్థానికులు చెప్పారు.

అభిమాని టీ కొట్టులో టీ తాగిన ఐటీ మంత్రి

అభిమాని కొట్టులో టీ తాగిన ఐటీ మంత్రి

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బీఎస్​ఆర్ సెంటర్​ వద్ద... అజీజ్ అనే వ్యక్తి టీ కొట్టు నిర్వహిస్తుంటాడు. అజీజ్... మంత్రి గౌతమ్ రెడ్డికి వీరాభిమాని. ఎన్నికల సమయంలో తన దుకాణానికి వచ్చిన ప్రతి ఒక్కరిని గౌతమ్ రెడ్డికి ఓటేయ్యమని అభ్యర్ధించేవాడు. ఎమ్మెల్యేగా ఆయన గెలిస్తే... తన కొట్టుకు వచ్చిన ప్రతిఒక్కరికీ ఉచితంగా టీ ఇస్తానని అప్పట్లో ప్రకటించాడు. ఈ విషయం గౌతమ్​రెడ్డి దృష్టికెళ్లింది. అప్పటినుంచి ఆత్మకూరు వచ్చిన ప్రతిసారి... అక్కడ తేనీరు సేవించి తన అభిమానికి ఆనందాన్ని పంచుతున్నారు మంత్రి మేకపాటి. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన దుకాణానికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు అజీజ్.

ap-nlr-16-13-av-ap10061_23102019204035_2310f_1


Conclusion:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details