ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరులో ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ

By

Published : Dec 3, 2022, 8:16 PM IST

Aqua farmers: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అక్వా ఉత్పత్తుల్లో 65శాతం రాష్ట్ర నుంచి ఎగుమతి అవుతాయని, అటువంటి అక్వా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మిపురం గ్రామంలో ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Idem  Kharma
ఇదేం ఖర్మ

Aqua farmers: నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మిపురం గ్రామంలో ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సోమిరెడ్డి మాట్లాడుతూ ఆక్వా రైతు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కనీస గిట్టుబాటు ధర కూడా దక్కక రైతులు చితికి పోతున్నారని చెప్పారు.

ఒక్క మద్యం బాటిల్ కొంటే అయిదు రూపాయలు జగన్ జేబులోకి వెళుతోందని, ఇదే విధంగా ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు పెంచి తమ జోబులు నింపుకొంటున్నారని సోమిరెడ్డి విమర్శించారు. కాకాణి వ్యవసాయ మంత్రి అయిన తర్వాత రైతుల పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపించారు. ఆక్వా రైతులకు 240 రూపాయలు ధర కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆ ధర 180 రూపాయలకు తగ్గినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డితోపాటు టీడీపీ నేతలు బీదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details