ETV Bharat / state

పరిశ్రమలు రావాలని అన్ని రాష్ట్రాలు పోటీపడుతుంటే.. వైసీపీ మాత్రం తరిమేస్తోంది:చంద్రబాబు

author img

By

Published : Dec 3, 2022, 4:46 PM IST

Updated : Dec 3, 2022, 6:55 PM IST

CBN FIRES ON YCP GOVERNMNET
CBN FIRES ON YCP GOVERNMNET

CBN FIRES ON YCP: పరిశ్రమలు రావాలని అన్ని రాష్ట్రాలు పోటీపడుతుంటే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం కంపెనీలను తరిమేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీస్తూ.. ఉపాధి అవకాశాలు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

CBN FIRES ON YCP GOVERNMNET : రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్ఠను, సామర్థ్యాన్ని నాశనం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ రెండింటినీ చంపేసి వైసీపీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోందని మండిపడ్డారు. పరిశ్రమలు ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటే, ఏపీ మాత్రం కంపెనీలను తరిమికొడుతోందని విమర్శించారు. భూములను వెనక్కి తీసుకోవడం, దాడులతో వేధించడం, అనుమతులు నిరాకరించడం వంటి చర్యలతో ఏపీ ప్రతిష్ఠ దిగజారుతోందని విమర్శించారు.

ప్రజలిచ్చిన అధికారానికి ద్రోహం చేసి.. జగన్మోహన్ రెడ్డి క్షమించరాని తప్పులు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసుడు చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని దుయ్యబట్టారు. రాయలసీమలో 4 దశాబ్దాల కాలం పాటు దాదాపు లక్ష కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి రాష్ట్రానికే గర్వకారణంగా అమర్​రాజా సంస్థ నిలిచిందని తెలిపారు. ఏపీలో ఉన్న పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • In a span of 4 decades, Amararaja has become the pride of the State by creating direct and indirect employment to over 1 lakh families in Rayalaseema region.(1/5) pic.twitter.com/pWZrxXfHJM

    — N Chandrababu Naidu (@ncbn) December 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated :Dec 3, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.