ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సెలవుపై వార్డెన్...ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు

By

Published : Oct 24, 2021, 4:12 PM IST

వార్డెన్​ సెలవుపై వెళ్లడం.. వంట మనిషి రాకపోవడంతో 250 మంది విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని గురుకుల పాఠశాలలో జరిగింది. వార్డెన్ నిర్లక్ష్యంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఉన్నతాధికారులకు ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేశారు.

ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు
ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు

ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని గురుకుల పాఠశాల వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. పాఠశాలలో దాదాపు 250 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా.. అయిదు రోజులుగా సరైన భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. వార్డెన్ నరసింహులు ఎవరికీ చెప్పకుండా అయిదు రోజుల క్రితం సెలవుపై వెళ్ళిపోవడం, వంట మనిషి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయులే తమ సొంత నిధులతో విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు.

వార్డెన్ తీరుపై గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవసహాయం అధికారులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్​కు వార్డెన్ సక్రమంగా రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

MP lads funds: ఎంపీ లాడ్స్ నిధులపై వివరణ ఇవ్వాలని ఏపీకి కేంద్రం లేఖ

ABOUT THE AUTHOR

...view details