ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాతనాలపాడులో నాటు తుపాకుల కలకలం

By

Published : Aug 29, 2021, 6:50 PM IST

నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పాతనాలపాడులో ఓ ఇంట్లో రెండు నాటుతుపాకులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అటవీ జంతువుల వేటకు తుపాకులను తయారు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

పాతనాలపాడులో నాటు తుపాకుల కలకలం
పాతనాలపాడులో నాటు తుపాకుల కలకలం

నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పాతనాలపాడులోని నక్కల కాలనీలో ఒక ఇంట్లో రెండు నాటు తుపాకులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. జిల్లా అటవీశాఖ సమాచారం మేరకు ఈ తనిఖీ నిర్వహించినట్లు వెంకటగిరి రేంజ్ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు.

అటవీ జంతువులను వేటాడేందుకు.. ఈ తుపాకుల్ని తయారు చేసి అమ్మకాలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. నిందితుల వద్ద దుప్పి చర్మం, కొమ్ములు, తుపాకీ తయారీ పరికరాలను స్వాధీనం చేసుకుని వెంకటగిరికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details