ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Snake: సోమశిల గురుకుల పాఠశాలలో పాము.. ధైర్యం చేసి చంపిన విద్యార్థులు

By

Published : Apr 19, 2022, 12:24 PM IST

Snake: పిల్లలంతా నిద్రలో ఉన్నారు... ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు.. ఐదడుగుల పాము వాళ్లు నిద్రిస్తున్న గదిలోకి దూరింది.. పామును చూసి పిల్లలంతా నిద్రలేచారు... కొందరు భయపడి బయటకు పరుగులు తీశారు.. మరికొంతమంది ధైర్యం చేసి ఆ పామును చంపేశారు... ఈ ఘటన సోమశిల గురుకుల పాఠశాలలో నెలకొంది.

snake in gurukula school
సోమశిల గురుకుల పాఠశాలలో పాము కలకలం

సోమశిల గురుకుల పాఠశాలలో పాము కలకలం

Snake: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గురుకుల పాఠశాలలో తెల్లవారు జామున పాము కలకలం రెపింది. విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో నాగుపాము స్కూల్‌లోకి వచ్చింది. ఐదు అడుగులున్న పామును చూసి కేకలు వేస్తూ.. విద్యార్థులు పరుగులు తీశారు. కొందరు పిల్లలు పామును చంపేశారు. తెల్లవారుజామున విద్యార్థులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details