ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మేనకూరు సెజ్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

By

Published : Mar 7, 2022, 8:33 PM IST

Updated : Mar 7, 2022, 9:20 PM IST

నాయుడుపేట మేనకూరు సెజ్‌లో అగ్నిప్రమాదం
నాయుడుపేట మేనకూరు సెజ్‌లో అగ్నిప్రమాదం

20:31 March 07

నాయుడుపేట మేనకూరు సెజ్‌లో అగ్నిప్రమాదం

నాయుడుపేట మేనకూరు సెజ్‌లో అగ్నిప్రమాదం

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్​లోని లాయల్ టెక్స్ టైల్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కంపెనీ పరిధిలోని గోదాముల పైభాగంలో షార్ట్ సర్కూట్​తో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భయాందోళనలకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో కొందరు కార్మికులు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేప్రయత్నం చేస్తుండగా..మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యాజమాన్యం వెల్లడించింది.

ఇదీ చదవండి : Kavali: నెల్లూరు జిల్లా కావలిలో గుర్తు తెలియని మహిళ సజీవ దహనం..ఎవరామె..?

Last Updated :Mar 7, 2022, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details