ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పింఛన్లను పునరుద్ధరించకపోతే ఆందోళన ఉద్ధృతం: సీపీఎం

By

Published : Dec 30, 2022, 7:13 PM IST

CPM Agitation : ప్రభుత్వ పింఛన్లను రద్దు చేసినందుకు నిరసనగా నెల్లూరులో సీపీఎం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. పేదలకు ఆర్థికంగా అండగా ఉన్న పింఛన్లను ప్రభుత్వం కుంటిసాకులతో రద్దు చేసిందని.. వాటిని పునరుద్ధరించాలని సీపీఎం నేతలు కోరారు.

CPM Agitation  in Nellore
నెల్లూరులో సీపీఎం ఆందోళన

CPM Agitation : పింఛన్ల రద్దును నిరసిస్తూ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆందోళన నిర్వహించింది. నగరంలో ప్రదర్శన నిర్వహించిన అనంతరం.. కార్పొరేషన్ ప్రధాన ద్వారం ఎదుట సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. పేదవారికి ఆసరాగా ఉన్న పింఛన్లను కుంటిసాకులతో తొలగించటం దారుణమని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేసిన పింఛన్లను జనవరి 1నుంచి పునరుద్ధరించకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. లేనిపోని కారణాలతో తమకు ఇస్తున్న పింఛన్ నిలిపేస్తున్నారని లబ్దిదారులు తమ వద్ద వాపోతున్నారని.. వారికి పింఛన్లు తిరిగి ఇవ్వాలని సీపీఎం నేతలు ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details