ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tragedy: విషాదం : బెట్టింగ్‌తో అప్పుల ఊబిలో చిక్కుకుని దంపతుల ఆత్మహత్య

By

Published : Jun 27, 2021, 11:59 PM IST

నెల్లూరులో విషాదం(Tragedy) నెలకొంది. బెట్టింగ్(betting)​తో అప్పుల పాలై ఓ వ్యక్తి ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య సైతం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు(Inquiry) చేస్తున్నారు.

బెట్టింగ్‌తో అప్పుల ఊబిలో చిక్కుకుని దంపతుల ఆత్మహత్య
బెట్టింగ్‌తో అప్పుల ఊబిలో చిక్కుకుని దంపతుల ఆత్మహత్య

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన శ్రీనివాసులు... బెట్టింగ్‌(betting) కు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ పెట్టి అప్పులపాలయ్యాడు. అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బు ఇవ్వాలని అడుగుతుండటంతో.. మనస్తాపానికి గురై నెల్లూరులో రైలు పట్టాలపై పడి ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. భర్త మరణవార్త తెలుసుకున్న భార్య లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు... లక్ష్మీ ప్రసన్నను నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రసన్న మరణించింది(died). మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు(case) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details