ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN on nellore corporation: కోవర్టులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: చంద్రబాబు

By

Published : Dec 11, 2021, 8:58 PM IST

CBN on nellore corporation: నెల్లూరులో పార్టీ ఓటమికి కారకులైన వారిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన ఇద్దరు నేతలను సస్పెండ్‌ చేశారు. పార్టీలో కోవర్టులను ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

CBN on nellore corporation
తెదేపా అధినేత చంద్రబాబు

CBN on nellore corporation: నెల్లూరులో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు నేతలను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు. పార్టీ ఓటమికి గల కారణాలపై కార్పొరేషన్ అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇకపై తెదేపాలో కుమ్మక్కు రాజకీయాలు సాగవని నాయకులను హెచ్చరించారు.

CBN suspended leaders: నెల్లూరులోని పార్టీ డివిజన్ కమిటీలన్నీ చంద్రబాబు రద్దు చేశారు. త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కోవర్టుగా పనిచేసిన వెంకటస్వామి సస్పెన్షన్​కు గురయ్యారు. పూర్తిస్థాయి నివేదికల తర్వాత మరికొందరిపై వేటు తప్పదని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.

ఊరుకునేది లేదు..
CBN fire Coverts: పార్టీలో కోవర్టులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత నాయకులపై లేదా? అని ప్రశ్నించారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు పార్టీకి అవసరం లేదన్నారు. పార్టీని ఏవిధంగా పటిష్ఠం చేయాలో తనకు తెలుసన్నారు. తెదేపాలో యువరక్తం తీసుకువస్తాని చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేసేవారికే ఇకపై పార్టీ పదవులు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details