ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాణెం రూ.125... కానీ ఖరీదు రూ.3,200

By

Published : Jun 23, 2021, 7:17 AM IST

వివిధ రకాల కరెన్సీలను సేకరించటం అంటే అతని ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 30 ఏళ్లుగా రూ.లక్షలు ఖర్చు చేసి ఎన్నో దేశాలకు చెందిన నాణేలు, నోట్లను సేకరించాడు. అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ (rbi) విడుదల చేసే ప్రతి నాణేం అతని వద్దకు చేరాల్సిందే. ఈ తరహాలోనే నేతాజీ జయంతి సందర్భంగా ఆర్బీఐ విడుదల చేసిన రూ.125 నాణేంను కోనుగోలు చేశాడు. అతని గురించి తెలుసుకోవాలంటే... ఇదీ చదవాల్సిందే.

ఎండీ వాయిజ్
ఎండీ వాయిజ్

నెల్లూరు జిల్లా ఏఎస్ పేటకు చెందిన ఎండీ వాయిజ్​కు వివిధ రకాల కరెన్సీలను సేకరిచటం అంటే ఎంతో ఇష్టం. వాటి కోసం ఏంతైన ఖర్చు చేయాటానికి వెనుకాడడు. 30 ఏళ్లుగా వాటిపై మక్కువతో రూ.లక్షలు ఖర్చు చేసి దేశ విదేశాలకు చెందిన ఎన్నో రకాల కరెన్సీలకు సేకరించాడు. అదే అలవాటుగా మారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసే ప్రతి నాణెంను కొనుగోలు చేసే వాడు. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జన్మదినం సందర్భంగా ఆర్బీఐ విడుదల చేసిన రూ.125 నాణెంను రూ.3,200 ఖర్చుపెట్టి తెప్పించాడు. రూ.125 నాణెంను చూసేందుకు చాలా మంది వాయిజ్​ను సంప్రదిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details