ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఫిర్యాదు చేస్తాం'

By

Published : May 3, 2020, 5:22 PM IST

నెల్లూరు జిల్లాలోని ​అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తామని... భాజపా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు భరత్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో అధికారులను ఎమ్మెల్యేలు భయబాంత్రులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరించింది. సమన్వయంతో పనిచేయాల్సిన అధికారులపైనే వైకాపా ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం దారుణమని... భాజపా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు భరత్ కుమార్ విమర్శించారు.

కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించేలా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెదిరింపులకు దిగుతున్న ఎమ్మెల్యేల తీరుపై తాము కోర్టుకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details