ఆంధ్రప్రదేశ్

andhra pradesh

DEER: ఇంట్లోకి ప్రవేశించిన చుక్కల దుప్పి.. పట్టుకున్న అటవీ అధికారులు!

By

Published : Jul 15, 2021, 4:18 PM IST

Updated : Jul 15, 2021, 7:22 PM IST

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది ఓ చుక్కల దుప్పి. ఎక్కడి నుంచో జనావాసాల్లోకి వచ్చిన ఆ దుప్పి ఇంట్లోకి ప్రవేశించి హైరానా పుట్టించింది. చివరకు అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో వారొచ్చి దానిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ సంఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలంలో జరిగింది.

ఇంట్లోకి ప్రవేశించిన చుక్కల దుప్పి
ఇంట్లోకి ప్రవేశించిన చుక్కల దుప్పి

ఇంట్లోకి ప్రవేశించిన చుక్కల దుప్పి

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో ఓ దుప్పి.. అనూహ్యంగా శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షమైంది. గదిలోకి ఆవుదూడ వెళ్లిందని భావించిన కుటుంబ సభ్యులు.. లోపలకి వెళ్తే దుప్పి కనిపించే సరికి అవాక్కయ్యారు. దుప్పిని లోపలే ఉంచి గదికి తాళం వేశారు. ఆత్మకూరు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారి పిచ్చిరెడ్డి తన బృందంతో వచ్చి.. ఆ దుప్పిని పట్టుకున్నారు.

అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించే క్రమంలో దుప్పి గాయాలపాలైంది. చికిత్స చేసిన అధికారులు దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కనిగిరి రిజర్వాయర్ అటవీ ప్రాంతం నుంచి గానీ, నరసింహకొండ అటవీ ప్రాంతం నుంచి గానీ దుప్పి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Last Updated :Jul 15, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details