ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Yarapathineni: "పల్నాడు ప్రమాద బాధితులను... ప్రభుత్వం ఆదుకోవాలి"

By

Published : May 30, 2022, 12:18 PM IST

Yarapathineni: పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని పరామర్శించారు. మృతుల మట్టి ఖర్చుల కోసం తెదేపా తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

Yarapathineni
మాజీ ఎమ్మెల్యే యరపతినేని

Yarapathineni: పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను గురజాల ప్రభుత్వాస్పత్రిలో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మట్టి ఖర్చుల కింద రూ.10వేలు గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో తెదేపా తరఫున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా కింద ఒక గంటలో మట్టి ఖర్చుల కింద రూ.30వేలు ఎక్స్​గ్రేషియా వచ్చేదని.. ఇప్పుడు ప్రభుత్వం ఆ పథకాన్ని తీసేసి కనీస బాధ్యత లేకుండా మృతుల కుటుంబాలను గాలికొదిలేసిందని విమర్శించారు. మృతులందరూ రైతులు, రైతు కూలీలు కావడంతో గాయపడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

మాజీ ఎమ్మెల్యే యరపతినేని

ABOUT THE AUTHOR

...view details