ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భార్యాభర్తల మధ్య గొడవ - మూడు ప్రాణాలు బలి - అనాథలా చిన్నారి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 7:25 PM IST

Updated : Nov 23, 2023, 7:35 PM IST

Triple Murder in Piduguralla : క్షణికావేశం.. ఒక పసివాడికి తండ్రిని దూరం చేసింది... రెండు కుటుంబాల్లో ఆరని చిచ్చు పెట్టింది. చివరకు మూడు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారి దారుణహత్యలకు దారి తీసింది. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన అనంత నరేష్, అతడి తండ్రి సాంబయ్య, తల్లి ఆదిలక్ష్మి.. కోడలు మాధురి, ఆమె తండ్రి, సోదరుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో కలకలం రేపింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అసలేం జరిగిందంటే.!

triple_murder_in_palnadu_district
triple_murder_in_palnadu_district

భార్యాభర్తల మధ్య గొడవ - మూడు ప్రాణాలు బలి - అనాథలా చిన్నారి

Triple Murder in Piduguralla of Palnadu District :భార్యాభర్తల మధ్య విభేదాలతో ఓకే కుటుంబంలో ముగ్గురు హత్యకు గురి కావడం కలకలం రేపింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన నరేష్‌కు ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన మాధురికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మొదటి భార్యతో విభేదాల వల్ల విడాకులు తీసుకున్న నరేష్​ మాధురిని రెండో వివాహం చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం భర్త వేధిస్తున్నాడని మాధురి తన తండ్రి సుబ్బారావు, సోదరుడు శ్రీనివాసరావుకు ఫోన్ చేసి చెప్పింది.

నెల్లూరు జిల్లాలో ఆ ముగ్గురిని చంపింది.. ఆ ముగ్గురే.. ఆస్తి కోసమేనటా!

Three Members Died In one Family : రాత్రి 8గంటల సమయంలో తండ్రి, సోదరుడు కోనంకి గ్రామంలోని మాధురి ఇంటికి వచ్చారు. రాత్రి పదిన్నర గంటలకు వారంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలోనే నరేష్, అతని తండ్రి సాంబయ్య, తల్లి ఆదిలక్ష్మిపై కత్తులతో సుబ్బారావు, శ్రీనివాసరావు దాడి చేశారు. దాడిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మాధురి, ఆమె తండ్రి సుబ్బారావు, సోదరుడు శ్రీనివాసరావు ముప్పాళ్ల వెళ్లిపోయి అక్కడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఆ తర్వాత ముగ్గురిని తీసుకొని పోలీసులు కోనంకి గ్రామానికి వచ్చారు. ఒకే గదిలో మూడు మృతదేహాలు ఉన్నాయి. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి హత్య వెనుక కారణమేంటో తెలియడంలేదని మృతుల బంధువులు చెబుతున్నారు.

ట్రిపుల్ మర్డర్​ కేసును కొట్టేసిన బెజవాడ కోర్టు..

అసలేం జరిగిందంటే...

Palnadu Crime : నిరుపేదలైన మాధురి తల్లిదండ్రులు.. నరేష్ వాళ్లది ఆర్ధికంగా బాగా ఉన్నకుటుంబం కావడంతో అమ్మాయికి ఏ లోటు లేకుండా ఉంటుందని భావించి రెండో వివాహమైనా పెళ్లికి అంగీకరించినట్లు బంధువులు తెలిపారు. వివాహం తరువాత కొంతకాలం బాగానే ఉన్నా...ఆ తరువాత భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు సమాచారం. మాధురి కుటుంబాన్ని తక్కువ చేసి చూడటం, కుటుంబ సభ్యుల్ని అవమానిస్తూ మాట్లాడంతో నరేష్ వైఖరిని మాధురి తప్పు పడుతూ ఉండేదని బంధువులు పేర్కొన్నారు. ఈ అంశంపై పలుమార్లు వారిద్దరూ మధ్య గొడవలు జరిగినట్లు వెల్లడించారు. బుధవారం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా... నరేష్ మాధురిపై చెయ్యి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి, సోదరుడికి ఫోన్ చేసి చెప్పగా.. వారు మాట్లాడేందుకు కోనంకి వచ్చారు. సాంబయ్య, ఆదిలక్ష్మి, నరేష్​తోవాదనకు దిగారు. ఈ క్రమంలో మాట మాట పెరగడంతో మాధురి తండ్రి సుబ్బారావు, సోదరుడు శ్రీనివాసరావు వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపి ఉంటారని బంధువులు భావిస్తున్నారు.

ప్రొద్దుటూరులో దారుణం

Family Members Murder :ముగ్గురు చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత మాధురి తెల్లవారుజామున కుమారుడు, తండ్రి సుబ్బారావు, సోదరుడుశ్రీనివాసరావుతో ముప్పాళ్ల పోలీస్ స్టేషన్​కు వెళ్లి...తన అత్త,మామ, భర్త తమపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుస్తులపై రక్తపు మరకలు ఉండటం, శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన ముప్పాళ్ల పోలీసులు పిడుగురాళ్ల స్టేషన్ పోలీసులను సంప్రదించారు. వారి సమాచారం మేరకు కోనంకి గ్రామంలో ముగ్గురిని హత్య చేసి స్టేషన్​కు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు... మాధురి, సుబ్బారావు, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఉదయం అక్కడి నుంచి పిడుగురాళ్ల స్టేషన్ కు తీసుకెళ్లారు. కుటుంబంలోని ఈ మూడు హత్యలకు సంబంధించి కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నిన్నటి వరకు గ్రామంలోని అందరితో కలివిడిగా ఉంటూ ఆనందంగా ఉన్న సాంబయ్య కుటుంబం.. నేడు బంధువుల చేతిలోనే బలి కావడం పట్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో పసివాడి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Nov 23, 2023, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details