ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Psycho Arrest: నరసరావుపేటలో వరుస హత్యలు.. సైకో అరెస్ట్

By

Published : May 12, 2023, 6:01 PM IST

Psycho Arrest: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఇటీవల వరుస హత్యలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన తన్నీరు అంకమ్మరావుపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. గతేడాది వృద్ధురాలి హత్య కేసులో పోలీసులు నిందితుడినిఅదుపులోకి తీసుకోగా.. సరైన ఆధారాలు లేవంటూ కోర్టు కేసు కొట్టివేసిందని చెప్పారు.

Psycho Arrest
Psycho Arrest

Psycho Killer Arrest: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇటీవల వరుస హత్యలకు పాల్పడిన సైకోను అరెస్ట్ చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. నరసరావుపేటలో జరిగిన వరుస హత్యలపై పల్నాడు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. పట్టణానికి చెందిన తన్నీరు అంకమ్మరావు అనే సైకో గత 2003 నుండి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు అరెస్టయ్యాడని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ తెలిపారు. అదేవిధంగా 2022వ సంవత్సరంలో ఒక వృద్ధురాలిని హత్య చేసి పోలీసులకు చిక్కాడని.. ఆ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసిందని చెప్పారు. తరువాత గత రెండు రోజుల క్రితం జరిగిన ఇద్దరు వ్యక్తుల హత్యల కేసులో సైకో అంకమ్మరావును అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యలు తానే చేసినట్లు అంగీకరించాడని ఎస్పీ వివరించారు.

రెండు రోజుల క్రితం నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను బండరాయితో కొట్టి చంపిన సైకో అంకమ్మరావు.. అదేరోజు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరో వృద్ధురాలిపై దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఆ వృద్ధురాలిపై కూడా అంకమ్మరావు అదే రోజు రాత్రి దాడికి పాల్పడ్డాడని అన్నారు. తీవ్ర గాయాలైన వృద్ధురాలు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందిందని తెలిపారు.

దీంతో సైకో చేతిలోనే వృద్ధురాలు మరణించిందని ఎస్పీ రవిశంకర్ రెడ్డి ధృవీకరించారు. ప్రస్తుతం నరసరావుపేట పోలీసుల అదుపులోనే సైకో అంకమ్మరావు ఉన్నాడని తెలిపారు. సైకో ఒకేరోజు ముగ్గురుపై దాడి చేసి చంపడంతో పల్నాడు జిల్లా ప్రజల్లో ఆందోళన పెరిగిందన్నారు. అయితే ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దని సూచించారు. పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో త్వరలో 24/7 పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తామని ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు.

వరుస హత్యలు చేస్తున్న సైకో అరెస్ట్

ఇదే నెలలో ఒక హత్య జరిగింది. మేము దాన్ని మొదట్లో హత్యగా గుర్తించలేదు. తర్వాత అనుమానంతో సీసీ కెమెరాలు చూడటంతో.. అందులో ఓ వ్యక్తి సిమెంట్ ఇటుకతో మోది చంపడం..అలాగే కాలు పట్టుకొని మృతదేహాన్ని లాగడం వంటి దృశ్యాలు నమోదయ్యాయి. అదే విధంగా 9వ తేదీ, 10వ తేదీన రెండు హత్యలు జరిగాయి. ఇతను కేవలం డబ్బుకోసమే ఈ హత్యలు చేసినట్టు నిర్ధారణయింది.- రవిశంకర్ రెడ్డి, పల్నాడుజిల్లా ఎస్పీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details