ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీలో ఏ ఒక్కరూ గెలవరు.. చంద్రబాబే మా సీఎం: పత్తిపాటి

By

Published : Jan 29, 2023, 7:37 PM IST

Pattipati Pullarao Comments: లోకేష్ యువగళం పాదయాత్రతో వైసీపీ పీఠాలు కదులుతున్నాయని.. పాదయాత్ర 4వేల కిలోమీటర్లు పూర్తయితే 175 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలవరని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఆయన స్పష్టం చేశారు.

Former Minister Pattipati Pullarao
మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు

Pattipati Pullarao Comments: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఇందులో వైకాపా మంత్రులకు ఎలాంటి సందేహం అవసరం లేదని.. ఈ విషయంపై మాకు స్పష్టత ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ మంత్రులు.. ఆ పార్టీలో గొడ్డలిపోటు లాంటి సంఘటనలు జరిగితే.. మీ పార్టీలో సీఎం ఎవరనే విషయంలో మీకే స్పష్టత ఉండదని ఎద్దేవా చేశారు. లోకేశ్​ పాదయాత్రపై అవాకులు చవాకులు పేలుతున్న మంత్రులకు ఈ విషయం స్పష్టంగా తెలియజేస్తున్నానన్నారు.

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు

పడిపోయిన వైసీపీ గ్రాఫ్ : సీ ఓటర్ ఇండియా టుడే సర్వేలో వైసీపీ గ్రాఫ్ 56 నుంచి 39 శాతానికి పడిపోయిందని పత్తిపాటి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వారు ఇచ్చిన సర్వేనే కచ్చితంగా ఉందన్నారు. సీ ఓటర్ సర్వేతో వైసీపీ ఇంటికి పోవడం ఖాయమని తేలిపోయిందని.. ఇక బుల్డోజర్లు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదన్నారు. లోకేశ్​ బాబు యువగళం పాదయాత్రతో వైకాపా పీఠాలు కదులుతున్నాయని.. పాదయాత్ర 4000 కిలోమీటర్లు పూర్తయితే 175 సీట్లలో వైకాపా ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా గెలవరన్నారు. సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని టీడీపీ పార్టీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే పథకాలు ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు.

దోపిడీ, దర్మార్గాలు ఆపితేనే డిపాజిట్లు : చంద్రబాబు వస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సంక్షేమ పథకాలు ఇంకా మెరుగైన స్థితిలో అమలు చేస్తామన్నారు. ఈ విషయం రాష్ట్రంలో ఉన్న ప్రజలు, యువత, రైతులు, మహిళలకు అందరికీ అర్థమైనా వైసీపీ మంత్రులకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఐప్యాక్ సర్వేలో 31 మంది మంత్రులు ఇంటికి పోవడం ఖాయమని చెప్పారని.. అందులో పల్నాడు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఉన్నారన్నారు. అచ్చెన్నాయుడు వాస్తవాలు మాట్లాడితే దుర్మార్గంగా కేసు పెట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు దక్కాలంటే ఇప్పటికైనా అరాచకాలు దోపిడీలు, దుర్మార్గాలు ఆపాలన్నారు.

రైతులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం : యువగళం పాదయాత్రకు భయపడిపోయే నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని పత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతుల వద్ద నుంచి అక్కడి ప్రభుత్వం కోటి లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. రాష్ట్రంలో ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 28 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసి రైతులను దారుణంగా మోసం చేసిందన్నారు. పత్తి, మిర్చి రైతులు నష్టపోయి ఆందోళన చెందుతుంటే పరిహారంపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. పత్తి మిర్చి రైతులను ఆదుకుంటామని చెప్పిన మంత్రులు ఏమయ్యారంటూ ప్రశ్నించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details