ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం గుంటూరు, పల్నాడు పర్యటన.. అధికారులు, నేతల ఏర్పాటు

By

Published : Nov 7, 2022, 10:05 PM IST

Cm Tour: ఈ నెల 11వ తేదిన ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి గుంటూరు, పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులో విద్యా దినోత్సవ వేడుకల్లో, పల్నాడులో స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటన ఏర్పాట్లను ఆయా జిల్లాల పాలనాధికారులు, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు.

Etv Bharat
Etv Bharat

Cm Tour In Guntur, Palnadu Districts: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ నెల 11న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని 11న గుంటూరులో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో భాగంగా గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఏ.యండి. ఇంతియాజ్, శాసనమండలి సభ్యులు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు షేక్ మహమ్మద్ ముస్తఫాలు పోలీసు పరేడ్ గ్రౌండ్​లో హెలిప్యాడ్, జింఖానా ఆడిటోరియం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆడిటోరియంను పరిశీలించారు.

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో సుగంధ ద్రవ్యాల పార్క్​ను సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. అక్కడ ఐటీసీ సంస్థ నిర్మించిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. భద్రత ఏర్పాట్లపై పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్ సమీక్షించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details