ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"సీఎం జగన్‌ తమ సామాజిక వర్గానికి చెందిన వారికే పోస్టులు ఇస్తున్నారు"

By

Published : Nov 9, 2022, 2:42 PM IST

TDP leader Somireddy: సీఎం జగన్‌ తమ సామాజిక వర్గానికి చెందిన వారికే సలహాదారులు, డీఎస్పీ పోస్టులు ఇస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. గతంలో డీఎస్పీ బదిలీల విషయంలో తెదేపా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై సోమిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఏటా కొనుగోళ్ల లక్ష్యం తగ్గిస్తున్నారని వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Somireddy Chandramohan Reddy
వైకాపాపై సోమిరెడ్డి ఆగ్రహం

TDP leader Somireddy: ఆనాడు ఎలాంటి ఆర్డర్ లేకుండానే డీఎస్పీ బదిలీలపై, తెదేపా ప్రభుత్వంపై వైకాపా అసత్య ఆరోపణలు చేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు అధికారికంగా వచ్చిన జీవోపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ సామాజిక వర్గానికే సలహాదారులు, డీఎస్పీ పోస్టులు ఇవ్వాలా అని నిలదీశారు. మిగిలిన సామాజిక వర్గాలవారు పనికిరారా అని ఆక్షేపించారు.

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రైతుల పేరెత్తే అర్హత కోల్పోయారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని ప్రతి ఏటా తగ్గిస్తూ చెల్లింపులు నెలలు తరబడి ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు.. గత ఖరీఫ్​లో తక్కువగా 40లక్షల టన్నులే ఏపీలో కొనుగోలు చేస్తే, తెలంగాణలో 70లక్షల టన్నుల కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. ఏపీలో ఇంత వరకు పాత బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు.

మంత్రుల కమిటీ ఏర్పాటయ్యాక ఆక్వా రైతులు మరింత నష్టపోయారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి మద్యం సీసా మీద ప్రభుత్వ పెద్దలకు కమీషన్ వెళ్తున్నట్లే.. ఆక్వా మేత మీద కూడా టన్నుకి రూ.5వేలు కమీషన్... ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఏటా 10లక్షల టన్నుల మేత తయారవుతున్నందున ఏటా రూ.500 కోట్ల వసూలుకు ప్రణాళికలు వేసుకున్నారని ఆక్షేపించారు. సీడ్ యాక్ట్, ఆక్వా యాక్ట్ వల్ల ప్రభుత్వ పెద్దల బ్లాక్​మెయిలింగ్​ పెరిగి ఆక్వా రైతులు నిండా మునిగిపోయారన్నారు.

వైకాపాపై సోమిరెడ్డి ఆగ్రహం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details