ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'క్రిమినల్ కేసులున్న వ్యక్తికి కీలక పదవి - అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా టీటీడీ'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 12:32 PM IST

Updated : Nov 16, 2023, 2:41 PM IST

TDP Anam Venkata Ramana Reddy on TTD: అధికారపార్టీ నేతల అవినీతికి టీటీడీ అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో దిల్లీ కేసులో తీర్పు వచ్చేవరకు టీటీడీ బాధ్యతల నుంచి ధర్మారెడ్డిని తప్పించాలని డిమాండ్ చేశారు.

TDP_Anam_Venkata_Ramana_Reddy_on_TTD
TDP_Anam_Venkata_Ramana_Reddy_on_TTD

'క్రిమినల్ కేసులున్న వ్యక్తికి కీలక పదవి- అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా టీటీడీ'

\TDP Anam Venkata Ramana Reddy on TTD: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ధ్వజమెత్తారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవరెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి పరిధిలో ఏ పనికైనా 10శాతం కమీషన్ తీసుకుంటున్న భూమన కరుణాకర్ రెడ్డిని ఇప్పటికే 10శాతం కరుణాకర్ రెడ్డిగా పిలుస్తున్నారంటూ విమర్శించారు.

Anam Fire on YCP Leaders:టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినవ రెడ్డి 5.45ఎకరాలు ఎలా కొనుగోలు చేశాడో కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆనం వెంకటరమణా రెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుమల శ్రీవారి సొమ్ము తిన్న ప్రతి రూపాయి తెలుగుదేశం అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల ఎలాగో టీటీడీలో ధర్మారెడ్డి వ్యవహారం అలానే ఉందని దుయ్యబట్టారు. ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద దిల్లీలో క్రిమినల్ కేసు నమోదైందని, తనపై ఉన్న క్రిమినల్ కేసుని దాచిపెట్టి ధర్మారెడ్డి టీటీడీ ఈవో అయ్యాడని మండిపడ్డారు.

"పేదరికంలో ఉండే సీఎం దంపతులకు భారతి సిమెంట్స్‌లో రూ.4 వేల కోట్ల విలువైన షేర్లు - ఎవరయ్యా పెత్తందారులు?"

అదే అవినీతి టీటీడీలో చేయడని నమ్మకం ఏంటని నిలదీశారు. ఐఏఎస్​లను కాదని, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. తిరుమలతిరుపతి దేవస్థానాన్ని అడ్డంపెట్టుకుని దిల్లీలో ధర్మారెడ్డి లాబీయింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. దిల్లీలో నమోదైన కేసుపై తీర్పు వచ్చే వరకూ ధర్మారెడ్డినిటీటీడీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు.

"అధికారపార్టీ నేతల అవినీతికి టీటీడీ అడ్డాగా మారింది. భూమన ఛైర్మన్‌ అయ్యాక టీటీడీ నిధులు దుర్వినియోగమయ్యాయి. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవరెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ సొమ్ము ప్రతి రూపాయి వసూలు చేస్తాం. తాడేపల్లి ప్యాలెస్​లో సజ్జల ఎలాగో.. టీటీడీలో ధర్మారెడ్డి వ్యవహారం అలానే ఉంది. ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద దిల్లీలో క్రిమినల్ కేసు నమోదైంది. తనపై ఉన్న క్రిమినల్ కేసుని దాచిపెట్టి ధర్మారెడ్డి టీటీడీ ఈవో అయ్యాడు. క్రిమినల్ కేసులున్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి ఎలా ఇస్తారు? టీటీడీని అడ్డం పెట్టుకుని దిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. దిల్లీ కేసులో తీర్పు వచ్చేవరకు ధర్మారెడ్డిని టీటీడీ బాధ్యతల నుంచి తప్పించాలి." - ఆనం వెంకటరమణారెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి

Anam Venkata Ramana Reddy on Jagan: 'జగన్ అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది.. 'సాక్షి'లోకి షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల పెట్టుబడులు'

Last Updated :Nov 16, 2023, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details