ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీస్​ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్​

By

Published : Dec 19, 2022, 2:14 PM IST

Student Unions on AP Police Jobs Notification : ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పోలీస్​ ఉద్యోగాలకు.. వయోపరిమితి పెంచాలని విద్యార్థి సంఘాలు చర్చా గోష్టి నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు వయోపరిమితి సడలించాలని ప్రభుత్వాన్ని కొరారు.

Student Unions
విద్యార్థి సంఘాలు

Student Unions on AP Police Jobs Notification : పోలీస్‌ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలంటూ విజయవాడలో విద్యార్థి సంఘాలు చర్చా గోష్టి నిర్వహించాయి. ఐదు సంవత్సరాలుగా నోటిఫికేషన్ విడుదల చేయకపోవటంతో అనేక మంది నిరుద్యోగులు వయో పరిమితి కోల్పోయారని వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్‌ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా పోలీస్​ నోటిఫికేషన్​ విడుదల చేయలేదని.. ఇప్పుడు చేస్తే అందులో వయో పరిమితి తగ్గించారని అన్నారు. పొరుగు రాష్ట్రాలు వయోపరిమితిలో సడలింపులు ఇచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సండలింపు ఇవ్వదని ప్రశ్నించారు.

పోలీస్​ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details