ETV Bharat / state

అట్టడుగు ప్రజల అభ్యున్నతే న్యాయస్థానాల లక్ష్యం: జస్టిస్‌ చంద్రు

author img

By

Published : Dec 19, 2022, 9:54 AM IST

MADRAS HIGHCOURT FORMER JUSTICE CHANDRU: అట్టడుగు ప్రజల అభ్యున్నతికి అండగా నిలవడమే న్యాయస్థానాల లక్ష్యంగా ఉండాలని మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు అన్నారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల డ్రామా హాలులో ఆదివారం విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్‌ చిన్నపరెడ్డి శతజయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. .

MADRAS HIGHCOURT FORMER JUDGE JUSTICE CHANDRU
MADRAS HIGHCOURT FORMER JUDGE JUSTICE CHANDRU

MADRAS HIGHCOURT FORMER JUDGE JUSTICE CHANDRU: రాజ్యాంగ విలువలను కాపాడేందుకు జస్టిస్ చిన్నప్పరెడ్డి చేసిన కృషి అభినందనీయమని మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు అన్నారు. అనంతపురం జిల్లా విశ్వం విజ్ఞాన కేంద్రం కమిటీ ఆధ్వర్యంలో జస్టిస్ చిన్నపరెడ్డి శతజయంతి సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జస్టిస్ చంద్రు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీనియర్ న్యాయవాది గురుప్రసాద్‌ అధ్యక్షతన 'రాజ్యాంగ విలువలు... జస్టిస్‌ చిన్నపరెడ్డి తీర్పులు' అనే అంశంపై జస్టిస్‌ చంద్రు స్మారకోపన్యాసం చేశారు. అణగారిన వర్గాల కోసం అనేక న్యాయమైన తీర్పులు ఇచ్చిన ఘనత చిన్నప్పరెడ్డికి దక్కుతుందన్నారు. వ్యక్తి గత అభిప్రాయాలను గౌరవించాలన్నారు. సామాన్య ప్రజలకు కోర్టులు ఉపయోగపడాలని ఆయన కోరుకున్నట్లు గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.