ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sand Mining Mafia: అక్రమార్కులకు అడ్డేదీ..? రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

By

Published : Jul 4, 2023, 10:08 AM IST

Updated : Jul 4, 2023, 1:36 PM IST

Sand Mining Mafia: రాష్ట్ర వ్యాప్తంగా కాలువలు, చెరువుల్లో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వేస్తున్నారు. వీరిని అడ్డుకునే నాథుడే లేడు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని పాలేటి వాగులో చెరువులను ఇష్టానుసారం గుల్ల చేస్తూ.. ట్రాక్టర్లలో విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు కావడంతో అడిగే అధికారే కరవయ్యాడు.

sand mining
ఇసుక తవ్వకాలు

అక్రమార్కులకు అడ్డేదీ..? రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

Sand Mining Mafia: రాష్ట సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. కాలువ, చెరువుల్లో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వేస్తున్నారు. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు కావడంతో అడిగే అధికారే కరవయ్యాడు. దాంతో దోపిడీదారులు మరింతగా రెచ్చిపోతున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో పాలేటి వాగులో చెరువులను ఇష్టానుసారం గుల్ల చేస్తూ.. ట్రాక్టర్లలో విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారు.

కృష్ణా నది ఉపనది పాలేటి వాగు.. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పాలేటి వాగులో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం దళారులు దందా నిర్వహిస్తున్నారు. కూలీలను పెట్టి కాలువకు ఆనుకుని ఉన్న చెరువుల్లో ఇసుక తవ్వేస్తున్నారు. వాగుకు ఇరువైపులా, మధ్యలో తవ్వకాలు జరుపుతూ.. ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఈ దందాను చిత్రీకరిస్తున్న ఈటీవీని చూసి కూలీలు తవ్వకాలు నిలిపివేశారు. ఇసుక లోడు కోసం వచ్చిన ట్రాక్టర్ కూడా వెనుదిరిగింది. ఇంతలా దోపిడీ జరుగుతున్నా అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు.

Sand mafia in Kadapa district : రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. సీఎం జిల్లాలో సబ్ కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

ఈ దందా నిర్వహించేందుకు దళారులు అక్కడక్కడ కాపలాగా ఉంటున్నారు. ట్రాక్టర్లతో నిత్యం వాగును తవ్వేస్తూ.. ఇష్టారీతిన దోచేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ నేతల అండతోనే ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా బ్రిడ్జికి ఇరువైపులా 500మీటర్ల వరకు తవ్వకాలు జరపకూడదు. అయినా బ్రిడ్జి దిగువనే దర్జాగా ఇసుక తోడేస్తున్నారు. హైవే పక్కనే ఈ దోపిడీ జరుగుతుండగా.. తెలంగాణ పరిధిలో ప్రాంతమని ఏపీ అధికారులు వదిలేస్తున్నారు. కానీ ఆ ఇసుకను జగ్గయ్యపేట నియోజకవర్గంలో విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక మాఫియా అరాచకాలతో ఏర్పడిన గుంతల్లో పడి ఎంతోమంది చిన్నారులు మృత్యువాత పడ్డారని స్థానికులు చెబుతున్నారు.

కృష్ణా జిల్లా టూ హైదరాబాద్ వయా వైసీపీ ఎమ్మెల్యే .. ఇలా జోరుగా ఇసుక అక్రమ రవాణా

"జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలులోని మునేటిలో ఇసుకను గుంతలు గుంతలుగా తవ్వేస్తున్నారు. అనంతరం వాటిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాను అడ్డుకునే నాథుడే లేడు. ఈ అక్రమ ఇసుక తవ్వకాల వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఆ గుంతల్లో పడి ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవలే ఓ చిన్నారి.. ఇసుక కోసం తవ్విన గుంతలో పడి మృతి చెందాడు. అయినా కూడా అధికారులు దీన్ని పట్టించుకోవటం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. ఇదే నియోజకవర్గంలోని పాలేరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇప్పటికై అధికారులు దీనిపై స్పందించి.. ఇసుక అక్రమ రవాణా దందాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నాము." - పెనుగంచిప్రోలు వాసి

అనుమతి ఒకచోట.. తవ్వేది మరోచోట.. హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయని ఇసుక మాఫియా

Last Updated : Jul 4, 2023, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details